హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్

  • రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత
  • ఆ తర్వాత మూడు గంటల్లోనే మాట మార్చారని ఆరోపణ
  • కూల్చిన క్రషర్లు తిరుమల కంపెనీవని ప్రకటించారని ఆగ్రహం
అక్రమ మైనింగ్ క్రషర్లకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూడు గంటల్లోనే మాటమార్చాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం తొమ్మిది గంటలకు కొత్వాల్‌గూడలో రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన అక్రమ మైనింగ్ క్రషర్లు కూల్చివేశామని హైడ్రా ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ మళ్లీ 12 గంటలకు అవి తిరుమల కంపెనీకి చెందినవని తెలిపిందని అన్నారు.

ఈ మూడు గంటల్లో హైడ్రా కమిషనర్‌ను ఎవరు బెదిరించారని ప్రశ్నించారు. ఎవరికి భయపడి ప్రకటనలో మార్పు చేసి విడుదల చేశారో చెప్పాలని అన్నారు. కూల్చివేసిన క్రషర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదని బీఆర్ఎస్ వాళ్లు ఆధారాలతో బయటపెట్టారని అన్నారు. అలాంటప్పుడు అది మంత్రిది కాదని చెప్పడానికి రంగనాథ్ ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం తొమ్మిది గంటలకు కొత్వాల్‌గూడలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన అక్రమ మైనింగ్ క్రషర్లు కూల్చివేశామని హైడ్రా ప్రకటన విడుదల చేసిందని గుర్తు చేశారు.

హైడ్రా అక్రమ క్రషర్లపై చర్యలు తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నామని అన్నారు. కానీ దానిలో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు రియల్ ఎస్టేట్ ముసుగులో దందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆస్తులు, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నట్లు తాము ఫిబ్రవరిలో బయటపెట్టామని అన్నారు. మంత్రి పదవిలో కూర్చుని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ఆయన ఇన్నేళ్లుగా రూ.500 కోట్ల విలువైన మైనింగ్ సంపదను తరలించారని, దానిని తిరిగి ఎలా రాబడుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

Dasoju Shravan
Ponguleti Srinivas Reddy
HYDCA
illegal mining
Telangana
BRS
mining scam

More Telugu News